Bhimavaram : మావుళ్లమ్మకు ఘనంగా ఆషాఢ సారె సమర్పణ
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
ఆషాఢ మాసం సందర్భంగా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారికి శనివారం మహిళా భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భీమవరంతో పాటు విజయవాడ, గుంటూరు, మార్కాపురం, హనుమాన్‌జంక్షన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు బృందాలుగా తరలివచ్చారు.
మేళతాళాలతో ఘనంగా ఊరేగింపు :
హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, బొండాడవారి వీధి, పెదఅమిరం తదితర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా మావుళ్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు.
2,000 కిలోల స్వీట్లతో సారె :
మహిళా భక్తులు సుమారు 2,000 కిలోల స్వీట్లను సారెగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఆలయంలో ప్రత్యేక పూజలు :
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
