Bhimavaram : భీమవరంలో కోలాహలంగా "కేఎన్ఆర్" జన్మదిన వేడుకలు
ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) జన్మదిన వేడుకలు శనివారం భీమవరం నియోజకవర్గంలోని భీమవరంలో ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, టీడీపీ కుటుంబ సభ్యులు, కేఎన్‌ఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అభిమానుల మధ్య వేడుకలు సందడి సందడిగా సాగాయి.
జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం క్రైస్తవ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనం అందించారు. పాత బస్టాండ్‌లోని అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ కటింగ్‌తో పాటు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు :
ఈ సందర్భంగా కేఎన్‌ఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోళ్ల నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జన్మదిన వేడుకలకు హాజరై "కేఎన్ఆర్" కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోళ్ల నాగేశ్వరరావు మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
"కేఎన్‌ఆర్" జన్మదిన వేడుకల సందర్భంగా భీమవరం పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో వేడుక ప్రాంగణం కిక్కిరిసింది. కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేశారు.




