Bhimavaram : భీమవరం ఏరియా ఆసుపత్రిలో ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే, కేఎన్ఆర్
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరం ఏరియా ఆసుపత్రిలో బుధవారం 'తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను జిల్లా కలెక్టర్ నాగరాణి, (PAC) చైర్మన్, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుతో కలసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన బాలింతలను, నవజాత శిశువులను సురక్షితంగా, ఉచితంగా తమ స్వగ్రామాలకు చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత పేదలకు నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు.
కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
