📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : తెదేపా రాష్ట్ర కార్యదర్శి "కేఎన్‌ఆర్" జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

 


పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

తెలుగుదేశం పార్టీ నేత కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్‌) జన్మదిన వేడుకలను ఆగస్టు 15న భీమవరంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేఎన్‌ఆర్‌ మిత్రమండలి, టీడీపీ, కూటమి అభిమానులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జన్మదిన వేడుకలకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా కేఎన్‌ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న రోగులు, వారి సహాయకులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు క్రైస్తవ వృద్ధుల ఆశ్రమం వద్ద వృద్ధులకు భోజనాలు అందజేస్తారు. అలాగే ఉదయం 11.30 గంటలకు పాత బస్టాండ్‌లోని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు భోజన పంపిణీ నిర్వహించనున్నారు.

సేవా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి అభిమానులు మరియు కేఎన్‌ఆర్‌ మిత్రమండలి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం