📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : మావుళ్లమ్మవారికి వెండి పళ్లెం, గిన్నె సమర్పించిన భక్తులు

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

మావుళ్లమ్మవారి దేవస్థానంలో పూజా, వినియోగం కోసం గొల్లవానితిప్పకు చెందిన కొప్పర్తి బేబీ, ఫణి అనీషా కుటుంబ సభ్యులు రూ.2.20 లక్షల విలువైన వెండి పూజా సామగ్రిని మంగళవారం అమ్మవారికి సమర్పించారు. 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణిని అమ్మవారి సన్నిధికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలను శేషవస్త్రంతో సత్కరించారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దాతలకు అమ్మవారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. అమ్మవారి సేవలో భాగంగా వెండి పూజా సామగ్రిని సమర్పించిన దాతలను ఆలయ అధికారులు, అర్చకులు అభినందించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం