📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

పోలీస్‌స్టేషన్లకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే సామాన్య ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా స్పందించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, వాటికి సంబంధించిన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీసుశాఖను ఆశ్రయిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా సమస్యలు పునరావృతం కాకుండా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిర్యాదులపై సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేశారు.

ఈ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 9 అర్జీలు అందాయి. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు, ప్రేమ పేరుతో మోసం వంటి సమస్యలను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ.. బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణతో పాటు కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం