Bhimavaram : కేఎన్ఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ‘డోర్ టు డోర్’ ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరం పట్టణంలోని 35వ వార్డు రామాలయం వీధిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ (ఇంటింటికీ టీడీపీ) కార్యక్రమం సోమవారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతి ఇంటినీ సందర్శించారు.
ఈ సందర్భంగా కే ఎన్ ఆర్ మాట్లాడుతూ..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును ప్రజలకు వివరించారు. స్థానికుల నుంచి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి తన వంతుగా గట్టి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావుతో పాటు స్థానిక నేతలు కొత్తపల్లి సుబ్బరాజు, కొత్తపల్లి అప్పల రాజు, నారాయణ రామకృష్ణ రాజు, తుంపాలా పరాలు, విజ్జురోతి రాఘవులు, భూపతి రాజు బుజ్జి రాజు, రావూరి క్రిష్ణ అప్పారావు, అరిటాకుల రాజా నాయుడు, కే కిషోర్, పి సతీష్, గూడపాటి బాబురావు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

