Bhimavaram : మావుళ్లమ్మ సేవలో జేసీ కల్పశ్రీ
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం: స్వచ్ఛవార్త :
జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు జేసీ కల్పశ్రీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు తదితరులు జేసీ కల్పశ్రీకి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
