Buttayagudem : నవజాత శిశువుకు తల్లిపాలే శ్రీరామరక్ష : సి డి పి ఓ పద్మావతి
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
నవజాత శిశువుకు తల్లిపాలే శ్రీరామరక్షగా ప్రతి గర్భవతి తెలుసుకోవాలని బుట్టాయగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ యు.వి. పద్మావతి అన్నారు. మండలంలోని తాడితోట అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పద్మావతి మాట్లాడుతూ..
పుట్టబోయే బిడ్డకు తనే పాలు ఇవ్వాలని, మరి ఇతర ఏ ఆహార పదార్థాలు, ఇతర రకాలైన పాలు ఇవ్వరాదని ప్రతి గర్భవతి నిర్ణయం తీసుకోవాలన్నారు. పుట్టిన గంటలోపే బిడ్డకు ముర్రు పాలు పట్టించాలని ఇదే బిడ్డకు మొదటి టీకా లాంటిదని చెప్పారు
సూపర్వైజర్ ఝాన్సీ మాట్లాడుతూ బిడ్డకు ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టాలని, ఆరు నెలలు నిండిన తర్వాత మాత్రమే అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలని వివరించారు. ఈ కార్యక్రమానికి అ ఎఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్త ఎం.కనక, గర్భివతులు, బాలింతలు, పిల్లలు హాజరైనారు.
