Buttayagudem : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి : బొరగం
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
ప్రతి తెలుగుదేశం కార్యకర్త పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పోలవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పోలవరంలో ఘనంగా టిడిపి క్యాడర్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ..
రాబోయే రోజుల్లో పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు పార్టీ కోసం నిరంతరం శ్రమించే ప్రతి కార్యకర్తకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సమావేశంలో మండలం పార్టీ అధ్యక్షుడు మంగిన వెంకటరమణ, డోకుల నాగేశ్వరావు,ఆకుల రాజా,పాదం ప్రసాద్, చిన్నారి,కోడి శ్రీను, యడ్ల వినోద్, పిల్లి నాగరాజు, మాగంటి రాము,పోతుల శ్రీను, నల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
