📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Buttayigudem : ప్రజారోగ్యంపై ఆకట్టుకున్న ఎల్‌.ఆర్‌. కృష్ణబాబు బృందం కళా ప్రదర్శనలు

ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం : స్వచ్ఛవార్త :

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రజారోగ్యంపై ఎల్‌.ఆర్‌. కృష్ణబాబు బృందం నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద డీఎంహెచ్‌ఓ, జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ, క్షయ నివారణ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ అండ్‌ హెచ్‌ఐవీ నియంత్రణ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కృష్ణబాబు బృందం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రక్తదానం, ప్రజారోగ్యం వంటి అంశాలపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. బృందం ప్రదర్శించిన ‘టీ స్టాల్‌’, ‘కింగ్‌ లాంటి కుర్రోడు’ వంటి కళారూపాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

యువత మాదకద్రవ్యాలకు, ముఖ్యంగా గంజాయి, హెరాయిన్‌ వంటి వాటికి బానిస కాకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కళాకారులు సందేశమిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయవచ్చని వివరించారు.

హెచ్‌ఐవీపై భయపడాల్సిన అవసరం లేదని, సకాలంలో పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చని అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, 2017 చట్టం ప్రకారం జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉందని తెలిపారు.

“జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు... జాగ్రత్త జాగ్రత్త అమ్మడు... హెచ్‌ఐవీ తెచ్చుకోకు – చీకటి తప్పు చేయబోకు”, “ఇంటికి దీపం ఇల్లాలు ఉండగా అపరిచితులతో పరిచయం వద్దు” వంటి పాటలు, సందేశాలతో కళాకారులు ప్రజలను చైతన్యపరిచారు.

కార్యక్రమంలో దిశా ఎన్జీవో సంస్థ పీఎం స్వాతి, ఓఆర్‌డబ్ల్యూ మంగతాయారు, పీఈ దుర్గారాణి తదితరులు పాల్గొన్నారు. 

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం