Eluru : రూ.1.65 కోట్లతో ఓవర్‌హెడ్ నీటి ట్యాంకుకు శంకుస్థాపన.. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :
ఏలూరు నగరంలోని 27వ డివిజన్‌లో రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన నీటి నిల్వ ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి సోమవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ..
ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయితే 27వ డివిజన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఒకే పార్టీ స్థిరంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తరచూ ప్రభుత్వాలు మారడం వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం ఏర్పడి ఆశించిన ఫలితాలు రావని, సుదీర్ఘకాలం ఒకే ప్రభుత్వం కొనసాగితే దీర్ఘకాలిక ప్రణాళికలు సమర్థవంతంగా అమలై రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యుల బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

