📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : ఏపీ వైద్య విద్యాభివృద్ధికి ఐదేళ్లలో రూ.590.02 కోట్లు : ఎంపీ పుట్టా మహేష్‌కుమార్

 


ఢిల్లీ/ఏలూరు : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.590.02 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ శుక్రవారం సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు.

కొత్త వైద్య కళాశాలలకు రూ.342.36 కోట్లు :

2021–26 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.342.36 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఎంపీ తెలిపారు.

పీజీ వైద్య సీట్ల పెంపునకు రూ.247.66 కోట్లు :

పీజీ వైద్య సీట్ల పెంపునకు మరో రూ.247.66 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు పుట్టా మహేష్‌కుమార్ పేర్కొన్నారు.

దేశంలో పెరిగిన వైద్య కళాశాలలు :

2014 నుంచి దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 846కు పెరిగినట్లు కేంద్ర మంత్రి సమాధానంలో వెల్లడించారని ఎంపీ తెలిపారు.

భారీగా పెరిగిన యూజీ, పీజీ సీట్లు : 

యూజీ వైద్య సీట్లు 51,348 నుంచి 1,39,489కు, పీజీ సీట్లు 31,185 నుంచి 86,360కు పెరిగినట్లు తెలిపారు.

వైద్య విద్యలో AI, సాంకేతికతకు ప్రాధాన్యం :

వైద్య విద్యలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. NMC ఆధ్వర్యంలో CBME-2024 ద్వారా ఆధునిక వైద్య విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

డిజిటల్ విద్యా విధానాలకు ప్రోత్సాహం :

పీజీ విద్యార్థుల కోసం డిజిటల్ లాగ్‌బుక్‌లు, ఈ-లెర్నింగ్, డిజిటల్ డాక్యుమెంటేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారని ఎంపీ తెలిపారు.

వైద్య నిపుణులకు AI శిక్షణ :

వైద్య రంగ నిపుణుల కోసం AIపై ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని NBEMS ప్రారంభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వివరించారని పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం