📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : DMF నిధులతో జిల్లాలో విద్య, వైద్యం, త్రాగునీటి సౌకర్యాలు - ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌

‎ఢిల్లీ/ఏలూరు : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (District Mineral Foundation-DMF) ద్వారా  సమకూరిన నిధులను వివిధ ప్రజావసరాల పనుల కోసం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే వెల్లడించారు. ఏలూరు జిల్లా సహా ఆంధ్రప్రదశ్‌ రాష్ట్రవ్యాప్తంగా DMF కింద సమకూరిన నిధులు, వాటిని వినియోగించిన వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.  

DMF కింద గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలో 38.37 కోట్ల నిధులు సమకూరగా, వివిధ పనుల నిమిత్తం 20.86 కోట్లకు కేటాయింపులు చేసినట్లు, అయితే జిల్లా యంత్రాంగం కేవలం 7.18 కోట్ల నిధులనే ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 93 మౌలిక సదుపాయాల పనులు, 32 తాగునీటి పథకాల పనులు, 15 విద్యా సంబంధిత, 15 ఆరోగ్య, 27 పారిశుధ్య నిర్వహణ, 10 ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏలూరు జిల్లాలో 93,900 మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని కేంద్రమంత్రి వివరించారు. 

‎DMF నిధుల వసూలు, వాటి వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన (PMKKKY) మార్గదర్శకాలు, 2024ను జారీ చేసిందని చెప్పిన కేంద్ర మంత్రి, ఈ నిధుల ఖర్చును ఆమోదించే అధికారం, జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలోని సంబంధిత DMF పాలక మండలికి ఉంటుందని స్పష్టం చేశారు. 

జిల్లా ఖనిజ ఫౌండేషన్ (DMF) ద్వారా సమకూరిన నిధులతో ప్రతి జిల్లాల్లో 70 శాతం వరకూ ఆరోగ్యం, విద్య, త్రాగునీరు సరఫరా, విద్య, నైపుణ్యాభివృద్ధి & జీవనోపాధి కల్పన మొదలైన ప్రాధాన్యతా రంగాలలోను, మిగిలిన 30 శాతం వరకు నిధులను మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఇంధనం, వాటర్‌షెడ్ అభివృద్ధి మరియు పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచే ఇతర రంగాలలో వినియోగిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలిపారు. అంతేగాకుండా, ఈ నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం  కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) చేత డీఎంఎఫ్ ఖాతాలను ఆడిట్ చేయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం