📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru I Town : పేకాట స్థావరంపై వన్‌టౌన్ పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్.. రూ.22,880 నగదు స్వాధీనం

ఏలూరు జిల్లా : ఏలూరు వన్ టౌన్ : స్వచ్ఛవార్త :

స్థానిక దక్షిణపు వీధిలోని పాత వేరుశనగ ఫ్యాక్టరీ గ్రౌండ్‌లో పేకాట ఆడుతున్న వారిపై వన్‌టౌన్ పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఎస్‌బీ సమాచారం మేరకు మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో పోలీసు సిబ్బంది ఈ దాడి చేపట్టారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.22,880 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వన్‌టౌన్ పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా దాడి నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి, అదుపులోకి తీసుకున్న వారిపై నిబంధనల మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ రామకృష్ణ  హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం