📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru I Town : మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి 8 రోజులు జైలు శిక్ష!

 

ఏలూరు జిల్లా : ఏలూరు(వన్ టౌన్): స్వచ్ఛవార్త :

మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఏలూరు 1టౌన్ సీఐ రామకృష్ణ హెచ్చరించారు.

ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు 1టౌన్ సిఐ రామకృష్ణ మరియు సిబ్బంది ఆగస్టు 13న తెల్లవారుజామున 2:30 గంటలకు పట్టణంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో మారుతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేశారు.

శుక్రవారం నిందితుడిని ఏలూరు ఎస్.జే.ఎస్.సి.ఎం కోర్టులో హాజరుపరచగా.., కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తి రావూరి మురళీకృష్ణ నిందితుడికి 8 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. 

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన వారవుతారని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం