📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : మత్స్య పడవలకు ట్రాన్స్‌పాండర్లు.. అక్రమ చేపల వేట నియంత్రణకు కేంద్రం చర్యలు : ఎంపీ పుట్టా మహేష్

  • ‎ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు, పుదుచ్చేరి పడవల చొరబాటు. 
  • ‎ఏపీ లో గత 5 సంవత్సరాలలో సుమారు 160 అక్రమ చేపల వేట కేసులు.
  • రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు దాటకుండా పడవలపై ట్రాన్స్‌పాండర్‌లు.
  • ‎364 కోట్ల వ్యయంతో కమ్యూనికేషన్ వ్యవస్థ. 


ఢిల్లీ/ఏలూరు : స్వచ్ఛవార్త :

రాష్ట్ర, అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు దాటకుండా మత్స్యకారుల భద్రతను పెంపొందించేందుకు చేపల పడవలకు ట్రాన్స్‌పాండర్లను అమర్చే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభలో వివరాలు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు.

మత్స్య సంపద రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ, బేస్‌లైన్ నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు చేపల వేట కార్యకలాపాల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సముద్ర మత్స్య నియంత్రణ చట్టం (MFRA) అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సముద్ర మత్స్య నియంత్రణ చట్టం (AP-MFRA), సంబంధిత నిబంధనలు అమల్లో ఉండటంతో పాటు సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైసెస్ (TEDs) వినియోగాన్ని తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల సముద్ర జలాల్లోకి తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన యంత్రాల పడవలు తరచుగా చొరబడుతున్నాయని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో సుమారు 160 అక్రమ చేపల వేట కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయాన్ని ఎంపీ పేర్కొన్నారు. 2022–23లో 21 పడవల నుంచి రూ.52,500, 2024–25లో మూడు పడవల నుంచి రూ.7,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.

మత్స్యకారులు అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటకుండా అవగాహన కల్పించేందుకు భారత మత్స్య శాఖ, భారత నౌకాదళం, భారత తీరరక్షక దళం సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రూ.364 కోట్ల వ్యయంతో కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ (VCSS) ప్రాజెక్టును అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా మత్స్య పడవలకు 100 శాతం ప్రభుత్వ వ్యయంతో ట్రాన్స్‌పాండర్లను అమర్చుతున్నారని, వాటిలో జియో-ఫెన్సింగ్ సాంకేతికత ఉండటంతో మత్స్యకారులు అనుమతించిన వేట ప్రాంతాలను దాటే సమయంలో ముందస్తు హెచ్చరికలు అందుతాయని, దీంతో రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల ఉల్లంఘనలు, అక్రమ చేపల వేటను సమర్థవంతంగా నిరోధించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం