📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా కైకలూరు పోలీసులకు ప్రశంస పత్రాలు

ఏలూరు జిల్లా : కైకలూరు/ఏలూరు : స్వచ్ఛవార్త : 

కైకలూరు సర్కిల్‌ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రాలు అందజేశారు. శనివారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా కైకలూరు రూరల్‌ సీఐ రవికుమార్‌, కలిదిండి ఎస్‌ఐ పవన్‌కుమార్‌, కలిదిండి హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం. శ్రీనివాస్‌, ముదినేపల్లి కానిస్టేబుల్‌ బి. నాగబాబులకు ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. 

పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా కృషి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

కైకలూరు సర్కిల్‌ పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు సీఐ, ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌లకు ప్రశంస పత్రాలు అందించారు.

కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కే. ప్రతాప్‌ శివకిషోర్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం