Eluru : బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ : ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు/ఢిల్లీ : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి తొలి నుంచీ కృషి చేసిన పార్టీ టీడీపీనేనని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లకు కోత విధించారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయంతో బీసీ యువతకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చట్టసభల్లోనూ బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
