📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru/Elbrus : సాహసమే శ్వాసగా... మౌంట్ ఎల్బ్రస్‌పై రెపరెపలాడిన 100 మీటర్ల త్రివర్ణం!


  •  ఏలూరు రూరల్ ఎస్సై వి. వెంకటేశ్వరరావు సాధించిన అరుదైన ఘనత
  •  పోలీసు అమరవీరులకు విజయం అంకితం

ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

దేశభక్తిని, కఠోర సాధనను మేళవిస్తూ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) వి. వెంకటేశ్వరరావు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన, ప్రతికూల వాతావరణానికి పేరుగాంచిన 'మౌంట్ ఎల్బ్రస్' (5,642 మీటర్లు) శిఖరాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మైనస్ డిగ్రీల తీవ్ర చలిని, దట్టమైన మంచును అధిగమించి శిఖరాగ్రానికి చేరుకున్న వెంకటేశ్వరరావు... అక్కడ 100 మీటర్ల పొడవైన భారీ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు.

అమరవీరులకు నివాళి :

తన పర్వతారోహణ విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసు శాఖలో కఠినమైన విధులు నిర్వహిస్తూనే, మరోవైపు క్రీడా స్ఫూర్తితో పర్వతారోహణను సాధన చేస్తూ ఆయన ఈ రికార్డు నెలకొల్పడం విశేషం.

ఎవరెస్ట్ దిశగా ఈ వెంకన్న అడుగులు :

ఇప్పటికే పలు పర్వతాలను జయించిన ఆయన, తన తదుపరి లక్ష్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'మౌంట్ ఎవరెస్ట్' అధిరోహణకు సిద్ధమవుతున్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, సాహస క్రీడల్లో ప్రతిభ చూపుతున్న వెంకటేశ్వరరావును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సహచరులు మరియు స్థానికులు అభినందించారు. ఆయన విజయం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం