📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Ghantasala : చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలి - సీడీపీవో ప్రసన్న విశ్వనాధ

కృష్ణా జిల్లా : ఘంటసాల : స్వచ్ఛవార్త :

చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని మొవ్వ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ప్రసన్న విశ్వనాధ అన్నారు. 

ఘంటసాల జడ్పీ హైస్కూల్లో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం రెండో రోజు బుధవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీడీపీవో ప్రసన్న విశ్వనాధ మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ అందించడంలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా చిన్నారులకు నూతన బోధన పద్దతులు, సృజనాత్మక కార్యకలాపాలు, చిన్నారుల అభ్యసన సామర్థ్యాల పెంపుదల, ఇతర అంశాల పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. 

శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారులకు మెరుగైన సేవలందించాలని కోరారు. అంగన్వాడీ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తల్లిదండ్రుల సమన్వయంతో పిల్లల అభివృద్ధికి కృషి చేయాలని సీడీపీవో ప్రసన్న విశ్వనాధ తెలియజేశారు. 

కార్యక్రమంలో ఐసీడీఎస్ ఘంటసాల, శ్రీకాకుళం సెక్టార్ల సూపర్ వైజర్లు టి.రమా నాగమణి, పీఆర్ రాజేశ్వరి, డీఆర్పీలు కొల్లూరి వంశీ మోహన్, తోపుల నాగబాబు, వేముల రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం