Hyderabad : కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి : కాళ్లపాలెం బుజ్జి డిమాండ్
కూకట్‌పల్లిలో ఘనంగా ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ప్రమాణ స్వీకారోత్సవం...
హైదరాబాద్ (కూకట్‌పల్లి)/ కైకలూరు : స్వచ్ఛవార్త :
కూకట్‌పల్లిలోని శ్రీ శ్రీ బ్యాంక్వెట్ హాల్ వేదికగా "ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్" నూతన కార్యవర్గ సామూహిక ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణ చంద్ర రావు (కాళ్లపాలెం బుజ్జి), ఉపాధ్యక్షులు గోళ్ళ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వం వహించారు.
కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలి :
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణ చంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి) మాట్లాడుతూ.. ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగా స్మారకంగా కృష్ణా జిల్లాకు "వంగవీటి మోహన్ రంగా జిల్లా" అని పునర్నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు, బహుజనుల సంక్షేమం కోసం రంగా చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం:
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జూనియర్ వంగవీటి మోహన్ రంగా, వంగవీటి శంతన్ కుమార్ హాజరయ్యారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మొటేపల్లి భరత్ కుమార్, గౌరవ సలహాదారులు యాళ్ల వరప్రసాద్, వాడవల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులతో సామూహిక ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ మహిళా అధ్యక్షురాలు దాక్షాయణితో పాటు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు, నూతన కమిటీ సభ్యులు ఎం.వి. రావు, గాదే విజయకుమార్, కృష్ణ ప్రియ, పి.ఆర్. నాయుడు, బాలువు సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మి జయప్రకాష్, రామచంద్రరావు, పల్నాడు సురేంద్ర, దాసు, తోట సుధ, హేమనాథ్, విజయనగరం నుంచి లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కొమ్మనా మాణిబాబు, కృష్ణరాజు, నరేష్, రవి ఆకుల నాగన్న, బాపట్ల శ్రీధర్, భాగ్యలక్ష్మి, కోటేశ్వరి, శిరీష, వేమూరి వెంకటేశ్వరరావు,ఉమా సింగబాబు చెల్లు వెంకట్ సోషల్ మీడియా తదితరులు పాల్గొని ప్రమాణ స్వీకారాలు చేశారు.




