Jeelugumilli : ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ : మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త :
ఇది మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సీ అని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువతులు , మద్దతుగా చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం పోలవరం నియోజకవర్గ స్థాయి ర్యాలీ కార్యక్రమం జీలుగుమిల్లి మండలం లో పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతు..
రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్ ప్రజలు చేసింది ఏమీ లేదని ఈ నిరుద్యోగుల బాధ వారికి పట్టదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన చూసినట్టయితే అరాచకాలు హత్యలు తప్ప ఏమి లేవు అని దుయ్యబట్టారు. వారు పండించే గంజాయి కి రేటు ఉంది తప్ప రాష్ట్రంలో రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదని హేళన చేశారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఏటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,50,000 ఉద్యోగుల పైచిలుక ఇచ్చాము అన్నారు.
ఈ రోజు రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగం కావాలి అంటే ప్రతిభ ఉంటే కాదు ధనం ఉండాలి అని అంటున్నారు. ఏ ఉద్యోగం కావాలి అన్న వారి అనుచులకు కార్యకర్తలకు తప్ప ప్రతిభ ఉన్న విద్యార్థులు కు రావటం లేదు అన్నారు. ఇచ్చిన కొద్దిపాటి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని ఏకపారేశారు.
వారు ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో నిరుద్యోగులకు ఇస్తాను అన్న నిరుద్యోగ భృతి గాలికి వదిలేసారని చంద్రబాబు నాయుడు వారి కుమారుడు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్రజలనుమోసం చేయడంలో వీరిని మించిన వారు లేరని నిరూపించుకున్నారని తెలియజేశారు.
నిరుద్యోగులను మోసం చేసిన నారా లోకేష్ తన విద్యాశాఖ మంత్రి కి అనర్హుడు అని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర నికి డిప్యూటీ సీఎం గా ఉన్న దత్త పుత్రుడు 30 వేల మంది ఆడవాళ్ళు తప్పిపోయారు అని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక వారి ఆచూకీ ఏమి అయింది అని ఎద్దేవా చేశారు.
ఈ దత్తపుత్రుడు వారి సినిమా రేట్లు పెంచుకోవడం కోసం రాజకీయాలకు వచ్చారని రైతులు సమస్యలు నిరుద్యోగుల సమస్యలు వారికీ పట్టదు అని నిప్పులు చేరి గారు. మీరు కేవలం నటనకే తప్ప నిజ జీవిత రాజకీయాలకు పరికరాలని ఎద్దేవా చేశారు. ఎన్ని వేషాలు వేసి పబ్బం గడుపుకున్న, ప్యాకేజీ అనే పదం పోదని హేళన చేశారు. ప్రశ్నించే గొంతు ప్యాకేజీ ముందు మూగబోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పోలవరం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో జీలుగుమిల్లి జగదాంబ సెంటర్ నుంచి రాలిగా బయలుదేరి స్థానిక ( ఎమ్మార్వో) కి వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శివాజీ , పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
