Kaikaluru : వివాదాలు వద్దు.. పరిష్కారమే ముద్దు: కైకలూరులో ‘మీడియేషన్ 3.0’ ర్యాలీలో న్యాయమూర్తి ఎమ్. శివ కిరణ్
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :
కోర్టు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కైకలూరులో ‘మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0’ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ ఎమ్. శివ కిరణ్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కోర్టు ప్రాంగణం నుండి కైకలూరు తాలూకా సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..
కోర్టుల్లో ఏళ్లకు ఏళ్లు నలిగిపోయే వివాదాలకు మధ్యవర్తిత్వమే (మీడియేషన్) అత్యుత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. సుదీర్ఘ కోర్టు కేసుల వల్ల సమయం, ధనం వృధా కావడమే కాకుండా సంబంధాలు దెబ్బతింటాయని ఆయన తెలిపారు. ‘రాజీ మార్గమే రాజా మార్గం’ అని గ్రహించి, ఇరువర్గాలు సామరస్యంగా కేసులను పరిష్కరించుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అని స్పష్టం చేశారు. ఇందులో ఎవరూ ఓడిపోరని, ‘అందరూ గెలిచే’ అవకాశం ఉంటుందని చెబుతూ... ‘ ర్యాలీలో "వివాదాలు వద్దు - పరిష్కారం ముద్దు", "జాతి కోసం మధ్యవర్తిత్వం", "గెలవాలి గెలవాలి - అందరూ గెలవాలి" అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో ఏ.జి.పి పి .పవన్ కాంత్, ప్యానెల్ అడ్వొకేట్స్, కైకలూరు బార్ అసోసియేషన్ సిబ్బంది, మీడియేటర్స్ ఎ. రాంబాబు, పి. ప్రసన్న కుమార్, డి. శివ ప్రసాద్, ఎం.ఎస్.ఎన్. సత్యనారాయణ, కోర్ట్స్ స్టాఫ్స్ మరియు PLV లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

