📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియుల కృతజ్ఞతలు


ఏలూరు జిల్లా : కలిదిండి/కైకలూరు : స్వచ్ఛవార్త :

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రతి ఏడాది ఆగస్టు 7న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కైకలూరులో అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

శనివారం కైకలూరు రహదారుల భవనంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అగ్నికుల క్షత్రియులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం అగ్నికుల క్షత్రియ సమాజానికి గర్వకారణమని అన్నారు. లక్ష్మణస్వామి వర్మ సమాజ అభ్యున్నతి కోసం చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నాలుగు మండలాల అగ్నికుల క్షత్రియ నాయకులు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం