📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : డీఎస్సీ ర్యాలీకి వెళ్లకుండా వైకాపా జిల్లా అధ్యక్షుడు డీఎన్‌ఆర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్

 

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

2025 మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనకుండా ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్)ను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆదేశాల మేరకు చేపట్టిన ర్యాలీకి డీఎన్‌ఆర్ హాజరుకాకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 

డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం హరించరాదని అన్నారు.

కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు సమన్యాయంతో పరిపాలన కొనసాగించాలని డీఎన్‌ఆర్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.

డీఎన్‌ఆర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసుల చర్యను వారు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం