📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : కైకలూరు కోర్టు ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

స్థానిక కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.వి.ఎన్‌.వి. లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ప్రాంగణంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. శివకిరణ్‌, కైకలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌ శంకర్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ప్యానెల్‌ అడ్వకేట్లు, మీడియేషన్‌ అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది, పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ స్ఫూర్తిని చాటుతూ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పింది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం