📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నదానం

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

మండలంలోని కొల్లేటికోటలో కొలువై ఉన్న భక్తుల కొంగుబంగారంగా, ఇలవేల్పుగా విరాజిల్లుతూ భక్తులచే కొలవబడుతున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు 12న వడ్లకూడితిప్ప గ్రామానికి చెందిన ముంగర నరసింహారావు, అంజలి దంపతులు సహకారంతో అన్నదాన  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాసు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పెద్దింటి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

దేవస్థానం చైర్మన్ జల్లూరి వెంకన్నబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం