📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : 22-ఏ జాబితా నుంచి భూములు తొలగించాలి.. రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

కలిదిండి : స్వచ్ఛవార్త :

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులతో సమావేశమై వారి భూ, రెవెన్యూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

22-ఏ జాబితాపై రైతుల ఆవేదన :

తమ భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు, బాధితులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. భూములు తమ ఆధీనంలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగకపోవడం, ఇతర అవసరాలకు వినియోగించుకోలేకపోతున్న పరిస్థితులను వివరించారు.

సమస్యలను సానుకూలంగా విన్న సీఎం :

రైతులు, బాధితులు వివరించిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా విన్నారు. ఆయా భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. డీనోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్డీఓకు డీనోటిఫికేషన్ అధికారాలు కల్పించాలని సూచించారు.

2,745 ఎకరాలకు పరిష్కారం :

ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాలకు చెందిన 830 కుటుంబాల పరిధిలోని 2,745 ఎకరాల భూములు రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు, లబ్ధిదారులకు 1-బి అడంగల్ ప్రతులను అందజేశారు.

తమ భూ సమస్యలకు పరిష్కారం చూపడంతో రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ భూములపై హక్కులు స్పష్టమయ్యేలా చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం