📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం – అండ్రాజు శ్రీనివాసరావు

 

అమరావతి/కలిదిండి : స్వచ్ఛవార్త :

స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ (కైకలూరు నియోజకవర్గం) అండ్రాజు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు, సామాజిక న్యాయానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కలిసి, కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించినందుకు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ను కలిసి, పొన్న మండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా కోరంగి గ్రామంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి అందించిన సహకారానికి కార్పొరేషన్ తరఫున అభినందనలు తెలియజేశారు. బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం