Kalidindi : మాజీ పార్లమెంట్ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అండ్రాజు శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మాజీ పార్లమెంట్ సభ్యుడు, అగ్నికుల క్షత్రియ ముద్దుబిడ్డ మోపిదేవి వెంకటరమణ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
మోపిదేవి వెంకటరమణ ప్రజా జీవితంలో అందించిన సేవలను ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు కొనియాడారు. సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు.
సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు కూడా మోపిదేవి వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.
