📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : సీఎం పర్యటనను పండగలా నిర్వహించి సభను విజయవంతం చేయాలి : శ్రేణులకు కూటమి నేతలు పిలుపు

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి పర్యటనను నూతన ఉత్సాహంతో పండగలా నిర్వహించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం కలిదిండి మండల కేంద్రంలోని ఏఎంసీ (మార్కెట్‌ యార్డు)లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆసూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను నూతన ఉత్సాహంతో పండగ వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమ్మేళనంతో కలిదిండి గడ్డ దద్దరిల్లేలా భారీగా ప్రజలు తరలివచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి, సభను విజయవంతం చేయాలని కోరారు.

కైకలూరు నియోజకవర్గంలోని కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కూటమి నేతలు పిలుపునిచ్చారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం