📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం.. మట్టగుంటలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కలిదిండి మండలం మట్టగుంట గ్రామానికి చెందిన ఆక్వా రైతులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

రైతులకు ఆర్థిక ఊరట :

ఈ సందర్భంగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ : 

ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అర్హత కలిగిన రైతులకు అనవసరమైన షరతులు లేకుండా రాయితీ కొనసాగించడం వల్ల ఆక్వా రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుందని తెలిపారు.

ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత :

కూటమి ప్రభుత్వం ఆక్వా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యుత్‌ రాయితీ కోసం ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల భారాన్ని భరిస్తూ ఆక్వా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు.

మోదీ సహకారంతో.. చంద్రబాబు నాయకత్వంలో :

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాసరావు అన్నారు. విద్యుత్‌ రాయితీ కొనసాగింపు నిర్ణయం ఆక్వా రైతులలో మరింత భరోసాను కల్పించిందని తెలిపారు.

కార్యక్రమంలో డీసీ వైస్‌ చైర్మన్‌ నాగిడి వీరబ్రహ్మం, మోకా వెంకటరమణ, కోకా తాతయ్య, చిన్ని కృష్ణ, కోపనాతి శంకర్‌, పలువురు ఆక్వా రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం