Kalidindi : కొండంగి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల.. అక్వా రైతులకు సాగునీటి భరోసా
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మండలంలోని కొండంగి గ్రామంలో ఎత్తిపోతల పథకం ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేశారు. కైకలూరు ఎమ్మెల్యే, గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..
2014-19 కాలంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కొండంగి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ పాలనలో ముందుచూపుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడంతో కలిదిండి మండలంలోని అక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్న కామినేని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

