📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : కలిదిండి మీ భూమి - మీ హక్కు సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాయింట్స్

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

• మీ భూమి- మీ హక్కు సభలో ఈ కేవైసీ అనంతరం నల్లజెర్ల దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజ ముద్రతో కూడిన పట్టా దారు పాస్ పుస్తకాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

• కలిదిండిలో గ్రామ సభకు హాజరైనట్టు గా రిజిస్టర్‌లో సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

• రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ వేగంతో అభివృద్ధి చేస్తోంది

• రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని 22ఏలో పెడితే దానిని పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చాం.

• మీ భూమి- మీ హక్కు దానిపై ఇతరుల పెత్తనం చేయడానికి లేదు. పాస్ పుస్తకాలపై ఇతరులు ఫోటోలు ఎలా వేసుకుంటారు

• 2019-24 మధ్య గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా రికార్డులు ధ్వంసం అయ్యాయి. 

• ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని డిజిటల్ గా 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారు

• 2024లో అధికారంలోకి రాగానే ఎక్కడికి వెళ్లినా భారీ ఎత్తున భూ ఫిర్యాదులు నాకు అందాయి

• అప్పుడే వీటన్నింటినీ పరిష్కరించాలని నిశ్చయించుకున్నాం. అంశాల వారీగా వాటిని పరిష్కరిస్తున్నాం

• ప్రజల సమస్యలు పరిష్కరించని 151 సీట్లు వచ్చిన వ్యక్తులు ఏమయ్యారో ప్రజలందరికీ తెలుసు.

• బటన్ నొక్కడం, పరదాల చాటున రావడం, సభలు పెట్టి చెట్లు నరికేయటం చేశారు గత పాలకులు

• కానీ ప్రతీ నెలా ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఈ సమావేశాల ద్వారా ప్రజల్ని కలుస్తున్నాం

• కరెన్సీకి ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నాం

• బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించాం

• క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశాం

• 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకూ రైతులకు, భూ యజమానులకు అందించాం

• 9365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. • 41 వేల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తప్పించి 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చాం

• ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తీసేసి పట్టాలు ఇచ్చాం

• ప్రతీ రైతుకు, భూ యజమానికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసే వరకూ విశ్రమించం

• భూమి తమదైనా వేర్వేరు ఇబ్బందులతో రైతులు, భూ యజమానులు ఇప్పటి వరకూ సమస్యలు ఎదుర్కోన్నారు

• 1986 నుంచి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేస్తున్నాం. లింక్ డాక్యుమెంట్లన్నీ ఆన్ లైన్ ద్వారా అందిస్తాం

• 9 లక్షల మందికి ఇప్పటి వరకూ ఆటో మ్యూటేషన్ సౌకర్యం కల్పించాం

• వారసత్వ భూములు రూ.10 లక్షల లోపు విలువ ఉన్న వాటికి కేవలం రూ.100తో బదిలీ చేసుకునేందుకు అవకాశం కల్పించాం

• రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే చేసి ఈకేవైసీ తీసుకున్న తర్వాతే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నాం

• గ్రామ సభ నిర్వహించి పూర్తి పారదర్శకంగా పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. 

• రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం. వివాదాలు తగ్గి లావాదేవీలు పెరుగుతాయి

• సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం

• ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానించి ప్రజలకు సులభంగా పౌరసేవలు అందేలా చర్యలు చేపట్టాం

• కొల్లేరు వద్ద తాగునీటి సమస్యను పరిష్కరించేలా రూ.36 కోట్లను కైకలూరుకు మంజూరు చేశాం

• కుళాయి ద్వారా సురక్షిత మంచినీరు అందించేలా చర్యలు చేపడుతున్నాం.

• పదేపదే మరమ్మత్తులు వచ్చే రహదారులకు కూడా శాశ్వత పరిష్కారం ఉండేలా ఆలోచన చేస్తున్నాం

• గత పాలనలో గోతులు పడిన రోడ్ల గురించి ప్రశ్నిస్తే బటన్ నొక్కామని సమాధానం ఇచ్చేవారు

• మేం సుపరిపాలన అందిస్తూనే సంక్షేమ కార్యక్రమాలను అందిస్తు్న్నాం

• ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గోతులు పడిన రహదారులను సిమెంట్ రోడ్లుగా మార్చేందుకు ఆలోచన చేస్తున్నాం

• గత పాలన తాలూకు విధ్వంసపు గడ్డు రోజులను అధిగమించి క్రమంగా అభివృద్ధివైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం

• 2019-24 మధ్య రాష్ట్రం ఆర్ధికంగా ధ్వంసమైంది, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం లాంటి పరిస్థితులు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి

• కానీ కూటమి వచ్చాక ఆక్వాకు రూ.1.50 కు యూనిట్ చొప్పున రాయితీ విద్యుత్ ను జోన్ తో నిమిత్తం లేకుండా ఇస్తున్నాం

• ప్రభుత్వానికి రూ.1150 కోట్ల అదనపు భారం పడుతుంది. దేశానికి ఆదాయం వచ్చేలా చేస్తున్న రైతుల కోసం దీనిని భరిస్తున్నాం

• నాన్ ఆక్వా జోన్ పరిధిలోని 12,500 మంది రైతులకు కూడా కొత్తగా ఈ రాయితీ విద్యుత్ అమలు అవుతుంది


-కలిదిండి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం