📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : సీఎం చంద్రబాబు పర్యటనను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

గురువారం కలిదిండి ఏఎంసీ (మార్కెట్ యార్డు)లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లు, ప్రజల తరలింపు, రవాణా, పార్కింగ్, తాగునీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

సీఎం పర్యటనకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు, నాయకులకు సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం