📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kamavarapukota : వంగవీటి మోహనరంగా విగ్రహం వివాదం.. కాపు సంఘాలకు రాధా–రంగా మిత్ర మండలి సంఘీభావం

ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త :

కామవరపుకోట మండలంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు దానిని వివాదాస్పదంగా మార్చి అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల రాధా-రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఆధ్వర్యంలోని బృందం మంగళవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది.

ఈ సందర్భంగా గౌరవ సలహాదారు వాడపల్లి సతీష్ కుమార్‌తో కలిసి కామవరపుకోట కాపు సంఘం అధ్యక్షుడు, సంఘ ప్రతినిధులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ వ్యవహారంలో కాపు సంఘాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ.. 

సమాజంలో శాంతి, సామరస్యాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు. వంగవీటి మోహనరంగా ఆశయాలను గౌరవిస్తూ సమాజ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.

రాధా-రంగా మిత్ర మండలి బృందం సంఘీభావం ప్రకటించడంపై కామవరపుకోట ప్రాంత కాపు సంఘాల నాయకులు, యువత హర్షం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం