📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : మార్కెట్లో ధరల నియంత్రణ కోసం మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం : మంత్రి కొల్లు


కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడే అవకాశం ఉన్నందున, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని రైతు బజార్‌లో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 

బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయంలో సుమారు 90 శాతం ఉద్యోగుల జీతాలకే వెచ్చించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కందిపప్పు, వంటనూనె, ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులను అవసరానికి అనుగుణంగా రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు ప్రభుత్వ చర్యలను అర్థం చేసుకుని సహకరించాలని, రైతు బజార్ల ద్వారా అందిస్తున్న ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం