📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : చదువుపై ఏకాగ్రతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా ఎస్పీ విద్యాసాగర్

కృష్ణాజిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

చైతన్యం కార్యక్రమంలో భాగంగా చల్లపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం, 112 హెల్ప్‌లైన్, ఈగల్ టీమ్, శక్తి టీమ్స్ సేవలు, మహిళలు మరియు బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అవగాహన కల్పించారు.

విద్యార్థినులతోఎస్పీ మాట్లాడుతూ... 

తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలంటే ముందుగా మనం ఉన్నతంగా ఎదగాలి. అందుకు చదువే ప్రధాన మార్గం” అని సూచించారు. చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఇతర వ్యాపకాల ప్రభావం మనపై ఉండదని, తల్లిదండ్రులను భవిష్యత్తులో గౌరవంగా చూసుకోవాలంటే ప్రస్తుతం కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని తెలిపారు.

▪️ఒకసారి విజయం సాధించామనే సంతృప్తితో ప్రయత్నాన్ని ఆపకూడదు. అత్యున్నత శిఖరాలను చేరుకోవాలంటే నిరంతర సాధన, పట్టుదల ఎంతో అవసరమని విద్యార్థినులకు ప్రేరణనిచ్చారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకుండా, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

▪️పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, తాము సాధించాలనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. అపజయం జీవితానికి ముగింపు కాదని, విజయానికి దారి చూపించే ఒక అనుభవమని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆశలను గుర్తు చేసుకుంటూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

▪️సామాజిక మాధ్యమాలు వాడే సమయంలో ప్రైవసీ పాటించాలని తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం తెలియజేయడం వలన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, మీ గోప్యతే మీ భద్రత అని తెలిపారు.

▪️అనంతరం విద్యార్థినులను బాల్య వివాహాలు, పోక్సో చట్టం తదితర అంశాలపై ప్రశ్నించి, వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా, బాలికలపై లైంగిక వేధింపులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.

▪️అలాగే తమ కళ్ల ముందు ఎక్కడైనా గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అత్యవసర పరిస్థితులు చోటుచేసుకుంటే ఆలస్యం చేయకుండా 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని విద్యార్థినులకు సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, రక్షణ వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

▪️చివరగా విద్యార్థినుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ, వారు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారనే విషయాలను తెలుసుకుని వారికి విలువైన సూచనలు అందించారు.

▪️విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

▪️అనంతరం గురుకుల విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరు మొక్కలను పెంచాలని తద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పి అభిషేక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, చల్లపల్లి ఇన్స్పెక్టర్ ఈశ్వర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం