📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలి : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్

భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు...

కృష్ణాజిల్లా : గన్నవరం : స్వచ్ఛవార్త :

ఈ నెల 24న భారత ఉపరాష్ట్రపతి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన భద్రతా, ప్రోటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు.

శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఎస్పీజీ అధికారులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం పుసునూరు గ్రామానికి వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో రూట్ భద్రత, కాన్వాయ్, ట్రాఫిక్, ప్రోటోకాల్ తదితర అంశాలపై సమీక్షించారు.

విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్, గ్రీన్ రూమ్, వీఐపీ రిసెప్షన్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, కాన్వాయ్ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కీలక ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాంబ్ డిస్పోజల్, వీడియో బృందాలతో ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

వైద్య బృందాలు, అంబులెన్సులు, అత్యవసర వైద్య పరికరాలు, ఫైర్ టెండర్లు సిద్ధంగా ఉంచాలని, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌ను అవసరమైన ఏర్పాట్లతో సేఫ్ హౌస్‌గా సిద్ధం చేయాలని సూచించారు.

ఉపరాష్ట్రపతికి అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, విమానాశ్రయం పరిసరాలు, రూట్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

అన్ని శాఖలు ఎస్పీజీ సూచించిన భద్రతా ప్రోటోకాల్‌ను తూచా తప్పకుండా పాటిస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో, పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ స్పష్టం చేశారు.

సమావేశంలో ఎస్పీజీ అధికారులు, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రమణ్యం, గన్నవరం తహసీల్దార్ శివయ్య, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, స్పెషల్ బ్రాంచ్ సీఐ వై. సత్యకిషోర్, పోలీస్, వైద్య, అగ్నిమాపక, విమానాశ్రయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం