Machilipatnam : పిల్లల హక్కుల పరిరక్షణకు అధికారులు కృషి చేయాలి : వి. గాంధీ బాబు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
పిల్లల హక్కుల పరిరక్షణకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) సభ్యులు వి. గాంధీ బాబు ఆదేశించారు.
జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు మంగళవారం మచిలీపట్నం డివిజన్ పరిధిలోని కాలేఖన్‌పేట, రుద్రవరం, మచిలీపట్నం, భైరగీపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంపీయూపీ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లను ఆయన విస్తృతంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, పోషకాహారం, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు, పరిశుభ్రత, హాజరు నమోదు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలించారు. హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పిల్లల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారి విద్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, మానసిక వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పిల్లల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో జిల్లా బాలల పరిరక్షణ అధికారి కిషోర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మధుబాబు, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ నాగరాజు, సంబంధిత సీడీపీవోలు, సూపర్వైజర్లు, రెవెన్యూ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.
