📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : గిరిజన విద్యార్థులకు విదేశీ విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలి : ఎంపీ బాలశౌరి

కృష్ణాజిల్లా : మచిలీపట్నం ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :

గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

లోక్‌సభలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై జరిగిన చర్చలో జాతీయ విదేశీ స్కాలర్‌షిప్ పథకంపై ఎంపీ బాలశౌరి ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఏటా 20 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయని, వీరిలో 17 సీట్లు ఎస్టీ విద్యార్థులకు, మూడు సీట్లు అత్యంత వెనుకబడిన గిరిజన తెగలకు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

విదేశాల్లోని QS టాప్-1000 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ, పోస్ట్‌-డాక్టోరల్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, నిర్వహణ భృతి, ఇతర విద్యా ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ఏటా 20 నుంచి 100కు పెంచడంతో పాటు కుటుంబ ఆదాయ పరిమితిని కూడా పెంచాలని ఎంపీ బాలశౌరి కోరారు. 2026-27 నుంచి 2030-31 వరకు పథకం కొనసాగింపుపై జరుగుతున్న EFC పరిశీలనలో ఈ ప్రతిపాదనలను చేర్చినట్లు కేంద్రం వెల్లడించింది.

గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యా ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని స్కాలర్‌షిప్‌ల సంఖ్యను పెంచడంతో పాటు ఆదాయ పరిమితిని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని బాలశౌరి పేర్కొన్నారు. విదేశీ విద్య ద్వారా గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు అందేలా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం