📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mandavalli : పలికేగూడెం ఓఎన్జీసీ ప్లాంట్‌లో భద్రతా తనిఖీలు : రక్షణ విధానాలను పరిశీలించిన ఏలూరు డిఎస్పీ

ఏలూరు జిల్లా : మండవల్లి : స్వచ్ఛవార్త :

మండవల్లి మండలంలోని పలికేగూడెం గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) వద్ద గురువారం సేఫ్టీ, సెక్యూరిటీ మరియు భద్రతా విధానాలను పోలీసు శాఖ మరియు ఓఎన్‌జీసీ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఏలూరు డి.ఎస్.పి డి. శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఈ పరిశీలన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డిఎస్పీ శ్రావణ్ కుమార్ ప్లాంట్ ఆవరణలోని భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ సిబ్బంది నిఘా, సీసీ కెమెరాల పనితీరు మరియు అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన రక్షణ చర్యలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్లాంట్‌లో పనిచేసే సిబ్బంది రక్షణతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓఎన్‌జీసీ ప్రతిపాదిత సేఫ్టీ ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించినప్పుడు తక్షణమే స్పందించేందుకు వీలుగా అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర రక్షణ చర్యలు నిరంతరం సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచనలు చేశారు.

కార్యక్రమంలో కైకలూరు రూరల్ సి.ఐ వి. రవికుమార్, మండవల్లి ఎస్.ఐ సిహెచ్. రామచంద్ర రావులతో పాటు ఓఎన్‌జీసీ సీనియర్ ఇంజనీర్ వి. శివప్రసాద్, సీనియర్ ఫోర్‌మెన్ (మెకానికల్) సిహెచ్. కుమార స్వామి మరియు ఇతర భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం