📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mattagunta : 🇮🇳 మట్టగుంట ZPHS లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳

 

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గ్రామ సచివాలయం, ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అండ్రాజు శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గ్రామ సచివాలయంలో జరిగిన వేడుకల్లో అండ్రాజు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మట్టగుంట ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతరం గ్రామ సచివాలయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన గ్రామానికి సంబంధించిన పలు సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేలా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం