📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : యువత లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి : న్యాయమూర్తి లక్ష్మీ

ముదినేపల్లి జూనియర్‌ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు...

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించేందుకు సరైన మార్గంలో క్రమశిక్షణతో కృషి చేయాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వి.వి.ఎన్.వి. లక్ష్మి అన్నారు.

అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గంలోని ముదినేపల్లి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి వి.వి.ఎన్.వి. లక్ష్మి మాట్లాడుతూ.. 

విద్యార్థి దశ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్య, విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.

యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై ఏకాగ్రత పెట్టాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఏజీపీ పి. పవన్ కాంత్, ప్యానల్ అడ్వకేట్లు చావలి శంకర శాస్త్రి, జి.వి. జితేంద్ర లు మాట్లాడుతూ.. 

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని చేరుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు, గురువులు అందించే సూచనలు, సలహాలను గౌరవించి పాటిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యార్థులు తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. త్రినాథ్, అధ్యాపకులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం