📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : విద్యార్థులు చదువులో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి


  •  కైకలూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు దావు నాగరాజు

ఏలూరు జిల్లా : ముదినేపల్లి (అల్లూరు): స్వచ్ఛవార్త :

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కైకలూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు దావు నాగరాజు పిలుపునిచ్చారు.

మండలంలోని అల్లూరు గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన శనివారం నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... 

గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పంతంగాని మృదుల (585 మార్కులు), ఈద రితిక (556 మార్కులు) లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారిని ప్రోత్సహించేందుకు తన వంతుగా ఒక్కొక్కరికి ₹5,000 చొప్పున నగదు బహుమతిని అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో ముందుకు సాగి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఎంఈఓ (MEO) K. నరేష్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ శీలం వెంకటశ్యామల, నాయకులు కుర్మ లాజరు, దాసరి శ్రీను, కాసాని బాల యేసు, బొమ్మన బోయిన వెంకటరత్నం, తోట నాగరాజు (నాగిని), రామ్మోహన్ రావు, కులమట్ల రాము, శీలం సురేష్, లుక్కా ఫణిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం