📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : అనారోగ్యంతో వివాహిత మృతి.. అంత్యక్రియలకు అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యానికి గురై ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని అన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోలగాని శ్రీలక్ష్మి (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిసింది.

శ్రీలక్ష్మికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ కుమారుడితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అంత్యక్రియలకు రూ.5 వేల సాయం :

శ్రీలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి స్పందించారు. తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి అంత్యక్రియలకు సహకరించిన అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్‌ను స్థానికులు అభినందించారు.





షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం