📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Narasaraopet : మాదిగలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి – MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు డిమాండ్..

 ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి... 

పల్నాడు జిల్లా : నరసరావుపేట : స్వచ్ఛవార్త :

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన మరియు పెండింగ్‌లో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలు అందించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ సోమవారం మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి, ఆర్థిక సహాయం, రుణ సబ్సిడీ తదితర పథకాలపై ఆధారపడిన అనేక మంది ఎస్సీ యువత, పేద కుటుంబాలు ప్రస్తుతం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

నిధులు విడుదలలో జాప్యం కారణంగా అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి, కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు కూడా పథకాలు అందించాలని కోరారు.

MRPS ప్రధాన డిమాండ్లు:

  • ఎస్సీ కార్పొరేషన్‌కు తగిన బడ్జెట్ నిధులు వెంటనే విడుదల చేయాలి.
  • పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల సబ్సిడీ/ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేయాలి.
  • ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కోసం కొత్త పథకాలు ప్రారంభించాలి.
  • ఎస్సీ కార్పొరేషన్ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.
  • ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు పథకాలపై అవగాహన కల్పించి, దరఖాస్తులు స్వీకరించాలి.
  • ఎస్సీ పేదల ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు.
  • ఎస్సీ కార్పొరేషన్ నిధుల విడుదల కోసం అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో నరసరావుపేట, పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు జమ్మలమూడి విజయ మాదిగ ఎమ్మార్పీఎస్ యువసేన నాయకులు పాలెపోగు వరుణ్ మాదిగ నరసరావుపేట మండల అధ్యక్షులు వేశపోగు తిమోతి మాదిగ అల్లూరువారిపాలెం గ్రామం అధ్యక్షుడు పచ్చల లాజర్ వినుకొండ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ పచ్చిగోళ్ళ సుధాకర్ మాదిగ పాలపాడు ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు మన్నవ సురేష్ మాదిగ సీనియర్ నాయకులు దావల చంటి మాదిగ పలువురు  పాల్గొన్నారు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం