Pamarru : ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో మొక్క నాటిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : పామర్రు : స్వచ్ఛవార్త :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొక్కను నాటారు. సోమవారం పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు గ్రామంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో అధికారులు, BEL ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
