📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Polavaram : వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలి : ఏలూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డిఎన్ఆర్

పోలవరం / కైకలూరు : స్వచ్ఛవార్త :

పోలవరం వరద ముంపు గ్రామాలను ప్రభుత్వం అత్యవసరంగా ఆదుకుని, ప్రతి బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు జీవనోపాధి భృతిని అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మంగళవారం పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం బాలరాజు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌తో కలిసి వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ..

వరదలతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నిత్యావసర వస్తువులు, తాగునీరు, వైద్య సేవలు అందించడంతో పాటు జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకునేలా కోరనున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో వేలేరుపాడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ జి. రామలక్ష్మి, కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు చిరంజీవి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం